ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జంషీర్

ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జంషీర్

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం ప్రకటించారు. నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడి‌గా కనిగిరి‌కి చెందిన షేక్ జంషీర్ అహమ్మద్ను నియమించారు. తనపై నమ్మకం ఉంచి మైనారిటీ సెల్ అధ్యక్షునిగా నియమించిన సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యేకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.