రోగులకు మెరుగైన సేవలు అందించాలి: గొట్టిపాటి

రోగులకు మెరుగైన సేవలు అందించాలి: గొట్టిపాటి

ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి విష జ్వరాలు, గున్యాతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం ఆమె పూరిమెట్ల గ్రామాన్ని సందర్శించి రోగులను పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.