కనిగిరిలో క్యాన్సర్ అవగాహన దినోత్సవం
ప్రకాశం: కనిగిరిలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి DSP సాయి యశ్వంత్ ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా DSP క్యాన్సర్ నిర్మూలనపై పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో CI కాజావలి, SS శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.