ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA
MDK: మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ నియోజకవర్గం MLA రోహిత్ రావు బుధవారం సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాగులు వంకలు దాటరాదని, రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల వద్ద పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.