వార్డులకు నోడల్ అధికారులు నియామకం

KRNL: నగరంలో పరిపాలన సౌలభ్యం కోసం నగరపాలక కమిషనర్ విశ్వనాథ కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు, ఆక్రమణల తొలగింపు, సీ.డీ వేస్ట్ మేనేజ్మెంట్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో అధికారికి కొన్ని వార్డులు కేటాయించి, ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు పర్యవేక్షించాలని ఆదేశించారు.