మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
VKB: నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పెద్దగొల్ల గోపాల్ అనారోగ్యంతో బాధపడి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుక్రవారం గ్రామానికి వెళ్లి గోపాల్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.