'సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'
RR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం ఎన్నికల ప్రారంభం నుంచి సాయంత్రం ఫలితాలు వెల్లడి వరకు పోలీసులు ప్రతిచోట అప్రమత్తంగా ఉండాలని సూచించారు.