సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల

NLR: సోమశిల జలాశయం నుంచి ఆదివారం కండలేరు జలాశయానికి అధికారులు జలాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సోమశిల ప్రాజెక్టు ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి, వెంకటరమణారెడ్డి ప్రత్యేకంగా పూజలు చేసి గంగమ్మకు వాయినాలు వదిలి నీటిని విడుదల చేశారు. తెలుగు గంగ నుంచి నేరుగా కండలేరు జలాశయానికి ప్రభుత్వ ఆదేశాలతో నీటిని విడుదల చేసినట్లు వారు తెలిపారు.