'విశాఖ ఉక్కుపై నిజాలు చెప్పాలి'

విశాఖ ఉక్కు భవిష్యత్తుపై ప్రజలకు నిజాలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను ఆదివారం కోరారు. ఉక్కులో 43 విభాగాలు ప్రైవేట్ పరం చేసి కార్మికులను తొలగించడం వాస్తవమని, నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించే బాధ్యత మాధవ్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.