ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ రాములు నాయక్, స్థానిక సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గిన్నెలు, టార్పాలిన్లు, తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.