ఉపాధి కూలీలకు చట్టాలపై అవగాహన

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షీటీం ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో 100 రోజుల ఉపాధి హామీ పనిలో పాల్గొన్న మహిళా కూలీలకు మహిళల భద్రత, హక్కులు, చట్టాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే 100 నంబర్‌కు కాల్ చేయాలని, షీ టీం సేవలను వినియోగించుకోవాలని సూచించారు.