'వరి కొయ్యలు కాల్చితే భూసారం తగ్గుతుంది'
KNR: వరికొయ్యలను కాల్చితే నష్టమే ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఇల్లందకుంట మండలం మల్యాల, లక్ష్మజీపల్లిలో హుజురాబాద్ ADA సునీత క్షేత్ర సందర్శన చేశారు. వరి కొయ్యలు కాల్చడం ద్వారా భూమిలోని ఆర్గానిక్ కర్బనమ్ తగ్గి పంటకు ఉపయోగపడే సూక్ష్మ జీవులు నశించి ఎరువులను మొక్క గ్రహించడం తగ్గిపోతుందన్నారు.