'సాంప్రదాయ ఉత్పత్తులకు సముచిత మార్కెట్ కల్పించాలి'
ADB: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో తయారవుతున్న సహజ, సాంప్రదాయ ఉత్పత్తులకు సముచిత మార్కెట్ కల్పించడం, బ్రాండింగ్, ఇతర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.