కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యయత్నం

కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యయత్నం

SKLM: కలెక్టరేట్ వద్ద ఓ మహిళ ఆత్మహత్య కు యత్నించింది. ఆమదాలవలస (M) మునగలవలసకు చెందిన ధనలక్ష్మి తనతో తెచ్చుకున్న పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడుతుండగా కలెక్టరేట్ సిబ్బంది అడ్డుకుని సమీప పొన్నాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం 108లో శ్రీకాకుళం రిమ్‌కు తరలించారు. చౌక ధరల దుకాణం డీలర్‌గా తొలగించడంతో సూసైడ్‌కు పాల్పడ్డానని ఆమె తెలిపింది