'పిల్లలకు సమతుల్య ఆహారం అవసరం'
KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ రాజాపూర్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం ముగింపు కార్యక్రమాన్ని సూపర్‌వైజర్ పద్మ గురువారం నిర్వహించారు. ఈ మేరకు పోషకాహారం ప్రాముఖ్యంపై ఇన్ఛార్జ్ సీడీపీవో శ్రీలత అవగాహన కల్పించారు. పిల్లలకు సమతుల్య ఆహారం అవసరమని, 5 సం.ల వరకు అంగన్వాడీలోనే చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.