'బస్సు సర్వీసు పునః ప్రారంభించాలి'

KNR: కరీంనగర్ నుంచి చల్లూరు మీదుగా జమ్మికుంటకు ఉదయం 6 గంటలకు వచ్చేలా బస్సు నడిచేది. ప్రస్తుతం ఈ బస్సు రావడం లేదని ప్రయాణికులు తెలిపారు. ఈ బస్సు వల్ల వల్భాపూర్,నర్సింగాపూర్, రెడ్డిపల్లి, చల్లూరు, తదితర ప్రాంతాల నుంచి రామగిరి ట్రైన్‌కు వెళ్లే ప్రయాణికులకు, వచ్చేవారికి సౌకర్యంగా ఉండేది. దీంతో ఈ బస్సు సర్వీసును పునః ప్రారంభించాలి ప్రయాణికులు కోరుతున్నారు.