గీత కార్మికులకు సేఫ్టీ మోకుల పంపిణీ

HNK: హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ అధికారులు వందమంది గీత కార్మికులకు సేఫ్టీ మోకులను పంపిణీ చేశారు. సేఫ్టీ మోకుల ఇంచార్జ్ బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులకు ప్రమాదాల నుంచి రక్షణ ఎలా పొందాలని అంశంపై తగిన సూచనలు తెలిపారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబయ్య పాల్గొన్నారు.