కొండవెలగాడ పిహెచ్‌సి ఆకస్మిక తనిఖీ

VZM: నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ ఎస్. జీవనరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐఎల్ఆర్ టెంప్రేచర్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి వ్యాక్సిన్ నిర్వహణ గురించి ఫార్మాసిస్ట్‌కి తగు ఆదేశాలు జారీచేశారు.