తహశీల్దార్‌ను నియమించాలని వినతి

సత్యసాయి: సోమందేపల్లి మండలానికి తహశీల్దార్‌ను నియమించాలని సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెనుకొండలో డిప్యూటీ తహశీల్దార్ గిరికి సోమవారం వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి మాట్లాడుతూ.. సోమందేపల్లిలో గత సంవత్సరం కాలంగా తాహశీల్దార్ లేక ప్రజలు, రైతులు, విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.