'భూ సర్వేలో జియో కోఆర్డినేషన్ ఖచ్చితత్వం తప్పనిసరి'
MLG: భూ సర్వేలో జియో కోఆర్డినేషన్ ఖచ్చితత్వం తప్పనిసరి అని కలెక్టర్ దివాకర టి.ఎస్. స్పష్టం చేశారు. మల్లంపల్లి మండలం రామచంద్రపురం, రాజేశ్వరరావుపల్లెలో భూసర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు. డేటా ఎంట్రీ, కొలతల నమోదు ప్రక్రియలను సమీక్షించారు. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఖచ్చితత్వంతో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.