కలెక్టరేట్ వద్ధ కార్మికుల ధర్నా

SKLM: మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్, కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటూ.. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సంఘం నాయకుడు తిరుపతిరావు మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 60 రోజులుగా కార్మికుల ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు స్పందించడం లేదని అవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై పోరాటం తప్పదని వారు హెచ్చరించారు.