చిన్నమంగళాపురంలో చర్చిపై దుండగుల దాడి

PPM: పాలకొండ మండలంలోని చిన్న మంగళాపురంలో పాస్టర్ అబ్రహం చర్చిని అర్థరాత్రి కొందరూ దుండగులు దాడికి పాల్పడ్డారు. చర్చి ప్రహరీని పడగొట్టి, తలుపుల అద్దాలను పగలగొట్టారు. పాస్టర్ అబ్రహం శనివారం చర్చికి వెళ్లి చూసేసరికీ దాడి జరిగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పాలకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.