బైకు దొంగలు అరెస్ట్.. 50 బైక్‌లు స్వాధీనం

కృష్ణా: ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురిని కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ గంగాధర్ రావు తెలిపిన వివరాల మేరకు.. కోడూరుకి చెందిన సురేశ్, షేక్ ఇబ్రహీం, కృష్ణారావు, మచిలీపట్నంకు చెందిన రిజ్వాన్‌లు చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నారన్నారు. వారిని అదుపులోకి తీసుకొని రూ.21 లక్షల విలువైన 50 బైక్‌లను స్వాధీనం చేసుకున్నాము.