అగ్నిప్రమాదం.. లారీ దగ్ధం
ఏలూరు సత్రంపాడు పారిశ్రామిక ఎస్టేట్‌లో ధర్మాకోల్ షీట్ల లోడుతో వెళ్తున్న లారీ గురువారం రాత్రి కరెంట్ తీగలకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయి మంటల్లో చిక్కుకుంది. దీంతో మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.