ఈ వర్షాకాలంలో కృష్ణమ్మకు పోటెత్తిన వరద
MBNR: ఈ వర్షాకాలంలో కృష్ణా నదికి గతంలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తింది. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులోకి కనివిని ఎరగని రీతిలో 2294 టీఎంసీల వరద నీరు వచ్చింది. ఇక జూరాల ప్రాజెక్ట్‌కు సైతం 1595 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 25 యేండ్ల తరువాత అత్యధికంగా 1635 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 5.691 టీఎంసీల నీరు ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.