విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: టీజీ వెంకటేష్
కర్నూలు: విజయవాడలో జరిగిన శాప్ రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ లీగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. డ్రాగన్ బోట్ అండర్-15 విభాగంలో పాల్గొని రెండో స్థానం సాధించిన విజేతలను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ తన కార్యాలయంలో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు.