కౌంటింగ్‌కు ఎక్కువ సమయం.. కారణం ఇదే.!
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తక్కువ శాతం పోలింగ్ కావడంతో ఒక్కో రౌండ్ ఫలితానికి 10 నుంచి 20 నిమిషాలు పడుతది. కానీ ఈ ఎన్నికపై అందరికీ ఆసక్తి ఉండటం.. మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ సాగుతోంది. దీంతో ఒక్కో రౌండ్ ఫలితానికి సుమారు 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది.