కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయిన ఎంపీ

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయిన ఎంపీ

EG: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టుబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్మల సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.