రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
SRD: రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కోహిర్ గ్రామానికి చెందిన సందీప్ కుమార్(26) మహబూబ్ సాగర్ చెరువు కట్టపై రివాల్వర్ తో ఎదపై కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఇతర నష్టాల వల్ల అతడు ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.