జడ్జీలు-అడ్వకేట్ల క్రికెట్ టోర్నమెంట్‌లో అడ్వకేట్స్ 'ఏ' విజయం
HYD: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మూడు రోజులపాటు జరిగిన హైకోర్టు జడ్జీలు-అడ్వకేట్ల క్రికెట్ టోర్నమెంట్‌లో అడ్వకేట్స్ 'ఏ' జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అరవింద్ నేతృత్వంలోని 'ఏ' జట్టు 'డీ' జట్టుపై విజయం సాధించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై సరదాగా క్రికెట్ ఆడి, బహుమతులు ప్రదానం చేశారు.