ఫీజు బకాయిల కోసం 30న విద్యాసంస్థల బంద్
KMM: పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా SFI ఆధ్వర్యంలో జరగనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఆదివారం సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.