కోతుల తరలింపులో సర్పంచ్ వినూత్న ప్రయత్నం

కోతుల తరలింపులో సర్పంచ్  వినూత్న ప్రయత్నం

MHBD: బయ్యారం మండలం కొత్తపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సోమవారం కోతుల తరలింపును వినూత్నంగా నిర్వహించారు. కొండముచ్చు వేషధారణలో, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి గ్రామ వీధులలో కోతులను తరిమికొట్టారు. గ్రామస్తులు సర్పంచ్ పనితీరు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.