CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
BHNG: పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఇవాళ చౌటుప్పల్ మండల కేంద్రంలో పలువురి లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసానిస్తుందని పేర్కొన్నారు.