జిల్లాలోని పలు పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
MHBD: జిల్లాలోని పలు పాఠశాలల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా లైబ్రరీ, డిజిటల్ తరగతి గదులను పరిశీలించి,షెడ్యూల్ ప్రకారం పాఠాలు, సృజనాత్మకతను వెలికితీసేలా విద్యను భోదించాలన్నారు. కిచెన్ షెడ్, డైనింగ్ హాల్‌లోని పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు. మానసిక, ఆరోగ్య స్థితిగతులను నిత్యం గమనిస్తూ ఉండాలని ఉపాధ్యాయ బృందానికి కోరారు.