CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: తాడికొండ నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ శుక్రవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు రూ. 20, 58,064 విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు అందరికీ ఆరోగ్యాన్ని అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.