అప్పన్న అన్న ప్రసాద పథకానికి రూ. లక్ష విరాళం

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆశ్రమం నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకానికి పంచవటి టౌన్‌షిప్‌కు చెందిన సూపరింటెండెంట్ టీ. సుధాకర్ రెడ్డి రామ నిర్మల దంపతులు రూ. లక్ష విరాళం అందించారు. బుధవారం చెక్కును దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు సేవా కార్యక్రమాల్లో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.