'ఆర్థిక సాధికారతలో మహిళలు ముందు వరుసలో ఉండాలి'
MNCL: బెల్లంపల్లి మండలంలోని MPDO కార్యాలయంలో సోమవారం MLA వినోద్, సబ్ కలెక్టర్‌తో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఆర్థిక సాధికారతలో, అభివృద్ధిలో మహిళలు ముందు వరుసలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.