కెమెరాకు చిరుత సంచారం దృశ్యాలు

కెమెరాకు చిరుత సంచారం దృశ్యాలు

KMR: కమ్మర్ పల్లి మండలం గట్టు పొడిచిన వాగు సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత ఆనవాళ్లు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో పరిసర గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.