విశ్వాస్ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ

విశ్వాస్ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ

HNK: జన్ విశ్వాస్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎంపీ మాట్లాడుతూ.. చిన్నచిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడం, వ్యాపార సౌలభ్యం పెంపు పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు నియంత్రణ వ్యవస్థలను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. శిక్షలు తగ్గించడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసం ఏర్పడదన్నారు.