రేషన్ దుకాణాలు తనిఖీ

రేషన్ దుకాణాలు తనిఖీ

KNL: పత్తికొండ పట్టణంలో గురువారం పత్తికొండ ఆర్‌డీఓ రామలక్ష్మి ఉచిత రేషన్ పంపిణీ దుకాణాలను తనిఖీ నిర్వహించారు. ఇళ్ల వద్దకు వచ్చి రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలను కూడా ఆమె పరిశీలించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.