హెలికాప్టర్‌ సర్వీసు ఛార్జీలు 49 శాతం పెంపు

హెలికాప్టర్‌ సర్వీసు ఛార్జీలు 49 శాతం పెంపు

ఉత్తరాఖండ్‌లో వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో చార్‌ధామ్ యాత్ర రెండోదశకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి యాత్రికులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సేవలకు బాబా కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లాలనుకునే భక్తులు గతేడాది కంటే 49 శాతం అదనపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. DGCA సూచనల మేరకు షటిల్ సేవలను తగ్గించడంతో ఛార్జీల పెంపు అనివార్యమైంది.