ఉపాధ్యాయ వృత్తి నుంచి న్యాయవాద వృత్తిలోకి..!

ఉపాధ్యాయ వృత్తి నుంచి న్యాయవాద వృత్తిలోకి..!

PDPL: ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు నోముల శ్రీనివాసరెడ్డి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు. భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల నుంచి సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా గత జూలైలో రిటైర్ అయ్యారు. లోకసత్తా ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా, మానేరు పరిరక్షణ సమితి స్థాపకుడిగా ఉన్నారు.