ఆటో డ్రైవర్లు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: ఎస్సై
కడప నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయరాదని కడప ట్రాఫిక్ SI జయరాములు సూచించారు. కడప నగరంలోని పాత బస్టాండ్,గోకుల్ లాడ్జి సర్కిల్ నుంచి 7 రోడ్ సర్కిల్ మధ్యలో ఇష్టానుసారంగా పార్కింగ్ చేసిన ఆటో డ్రైవర్లకు ఎస్సై జయరాములు బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా పార్కింగ్ చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.