శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం
BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు స్వాతి నక్షత్రం కావడం, అదే నా జన్మ నక్షత్రం కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది అని అన్నారు. దైవ ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, విజయాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.