'చెరువులు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి'

నారాయణపేట: కోసిగి మండలం బోగారం గ్రామంలో చెరువును ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర వెంకటయ్య ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి చెరువులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు.