NTR: దళారుల చేతుల్లో మోసపోతున్నాం మొక్కజొన్న రైతులు
NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో మొక్కజొన్న రైతులు ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దళారులు తమ ఇష్టానుసారం తక్కువ ధరలు చెబుతున్నారని, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1600-1700 మాత్రమే లభిస్తోందని వాపోయారు. పక్క రాష్ట్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు జరుగుతుండగా, ఏపీలో కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు.