మల్లూరు హేమాచల క్షేత్రం నూతన ఈవో నియామకం

MLG: మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ఈవోగా మహేశ్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఈవో సత్యనారాయణ హన్మకొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి దేవస్థానానికి బదిలీ అయ్యారు. భూపాలపల్లిలోని భక్తాంజనేయ దేవస్థానం ఈవోగా పనిచేసిన మహేశ్ మల్లూరు ఆలయ ఈవోగా నియమితులయ్యారు.