మల్యాల-సర్వాపూర్ రహదారి అధ్వానం.. కంకరతో కష్టాలు!

మల్యాల-సర్వాపూర్ రహదారి అధ్వానం.. కంకరతో కష్టాలు!

JGL: మల్యాల నుంచి సర్వాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రారంభించిన రహదారి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో, రోడ్డుపై వేసిన కంకర తేలి దుమ్ము ధూళి రేగుతోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు జారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, కంకర వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.