మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
NDL: నంద్యాల పట్టణంలో సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో ఇటీవల ఉపాధ్యాయుడు రామచంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బిసి ఇందిరమ్మ దంపతులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు.