అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
NRML: నిర్మల్‌లో గంజాయి విక్రయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి తెచ్చి పండ్ల వ్యాపారం ముసుగులో అమ్ముతున్నట్లు గుర్తించారు. నారాయణ థియేటర్ వద్ద దాడి చేసి సుమారు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య తెలిపారు.